బిగ్ బాస్ 4: నాగార్జున కోసం చార్టెడ్ ఫ్లైట్.. విషయమేంటంటే..

తెలుగులో బాగా పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ పై తొలినాళ్లలో విమర్శలు వచ్చిన మెల్లమెల్లగా క్రేజ్ తెచ్చుకుంది. దీనికి తోడు కింగ్ నాగార్జున్ వీకెండ్స్ లో హోస్ట్ గా చేసే హంగామాకు భారీ క్రేజ్ వచ్చింది. దీంతో షో ఆసక్తికరంగా కొనసాగుతోంది. నాగ్ హోస్టింగ్ మూడో సీజన్లో చాలా ప్లస్ కావడంతో నాలుగో సీజన్ కు కూడా నాగ్ నే ఎంచుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే.. ప్రస్తుతం నాగార్జున ఈ వీకెండ్ కు అందుబాటులో ఉండరు అనే వార్త ఇప్పుడు ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది.

నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు. సాలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటివలే షూటింగ్ ప్రారంభమైంది. థాయ్ లాండ్ షెడ్యూల్ లో పాల్గొనేందుకు నాగార్జున అక్కడికి వెళ్లారని తెలుస్తోంది. దాదాపు పది రోజులు అక్కడే నాగార్జున ఉండబోతున్నారు. దీంతో వీకెండ్ హోస్టింగ్ కు నాగ్ అందుబాటులో ఉండడం అనుమానమే అంటున్నారు. అయితే.. వీకెండ్ షూటింగ్ కు నాగ్ థాయ్ ల్యాండ్ నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ యాజమాన్యం ఈ ఏర్పాట్లు చేస్తుందని.. ఆయనే సొంతంగా ఏర్పాటు చేసుకుని వస్తారంటూ ప్రస్తుతం గాసిప్స్ రౌండ్ అవుతున్నాయి. దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. మూడో సీజన్లో ఒకసారి రమ్యకృష్ణ ఇలానే హోస్ట్ గా చేసి మెప్పించింది. మరి.. ఈసారి కూడా ఇలాంటి ఏర్పాట్లే చేస్తుందా నాగార్జునే చార్టెడ్ ఫ్లైట్ లో వస్తారా అనేది తెలియాల్సి ఉంది.