హీరోయిన్ ను నిజంగానే కొట్టేసిన హీరో, కారణం ఇదే

బిగ్‌ బాస్ బ్యూటీ నందిని రాయ్‌ హీరోయిన్ గా రూపొందిన సినిమా ఇన్ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌. ఈ సినిమా నేటి నుండి ఆహా లో స్ట్రీమింగ్‌ మొదలు అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పెద్ద ఎత్తున నందిని రాయ్ సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో సందడి చేయడం మొదలు పెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నందిని రాయ్‌ మాట్లాడుతూ సినిమా షూటింగ్‌ లో భాగంగా ఒక హీరోగా నటించిన వికాస్ తనను కొట్టాడు అంటూ చెప్పుకొచ్చింది. అతడు గట్టిగా నిజంగా చెంప మీద కొట్టడంతో కన్నీరు వచ్చాయంది.

అసలు విషయం ఏంటీ అంటే సినిమా షూటింగ్‌ సందర్బంగా వికాస్ కొట్టే సన్నివేశం ఉంది. నందిని రాయ్‌ ను అతడు కొడితే వెంటనే ఆమె కన్నీరు పెట్టుకోవాలి. మొదట రెండు మూడు టేక్‌ లు కొట్టినట్లుగా యాక్ట్‌ చేశాడు. అప్పుడు వెంటనే నాకు కన్నీరు రావడం లేదు. దాంతో నిజంగానే కొడితే రియల్‌ ఫీల్‌ ఉంటుందని.. అందుకే నిజంగా గట్టిగా మొహమాటం లేకుండా కొట్టేయమని చెప్పాను. దాంతో అతడు నిజంగానే నన్ను కొట్టాడు. ఆ సమయంలో నాకు నిజంగా కన్నీరు వచ్చాయని నందిని రాయ్‌ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. ఇన్ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ సినిమా కు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది.