అందాల ప్రదర్శణకు ఓకే చెప్పిన ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేథా పేతురాజ్‌ ఈమద్య వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈమె నటించిన రెడ్ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించింది. ఇప్పటి వరకు పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు స్కిన్‌ షో చేయలేదు. అవసరం అయితే ఖచ్చితంగా స్కిన్‌ షో చేస్తాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

పాత్ర డిమాండ్ మేరకు అందాల ప్రదర్శణ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా చెప్పింది. సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర అయినా కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉందని అనిపిస్తే నటించేందుకు సిద్దంగా ఉంటాను అంది. అల వైకుంఠపురంలో సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని, అందులో సెకండ్‌ హీరోయిన్ అయినా కూడా కథలో పార్ట్‌ అవ్వడంతో పాటు త్రివిక్రమ్‌ గారు రూపొందించిన సినిమా అవ్వడం వల్ల ఓకే చెప్పాను అంది. ఇక ముందు ముందు గ్లామర్‌ రోల్‌ లకు ఓకే చెప్తానంటూ స్టార్‌ హీరోలకు ఈ అమ్మడు హింట్‌ ఇస్తుంది. మరి ఈమెకు మెయిన్ లీడ్‌ ఛాన్స్‌ దక్కేనా చూడాలి.