పావల శ్యామలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలు

తెలుగు లో దాదాపుగా 250 సినిమాలకు పైగా నటించిన పావల శ్యామల ఎన్నో గుర్తుండి పోయే సినిమాల్లో కనిపించిన విషయం తెల్సిందే. ఆమె ఆర్థికంగా ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆమెను ఆదుకునేందుకు ఇండస్ట్రీ వర్గాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆమెకు పది వేల చొనప్పున పెన్షన్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. కాని పావల శ్యామల కు గత కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది.

మూడు నెలలుగా ఉంటున్న ఇంటికి కనీసం రెంటు కట్టలేని పరిస్థితిలో ఆమె ఉంది. దాంతో పాటు ఆమెకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఇటీవల కాలంలో నటించే ఓపిక లేకపోవడంతో నటించడం లేదు. దానికి తోడు ఆమె ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థంగా ఉండటం వల్ల ఆమెను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలంటూ కొందరు పిలుపునిస్తున్నారు. కరాటే కళ్యాణి తనకు తోచిన సాయంను అందించింది. మా వరకు పావల శ్యామల విషయాన్ని తీసుకు వెళ్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇంకా పలువురు కూడా ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.