జానీ సినిమా స్ట్రాటజీను ఫాలో అవుతోన్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ కు మరీ ఎక్కువ ప్రాధాన్యమేమీ ఇచ్చేయడు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ తన ఫిట్నెస్ పై, లుక్స్ పై పూర్తిగా ఫోకస్ తగ్గించేసాడు. ఈ నేపథ్యంలో పవన్ కొంత లావుగా అయ్యాడు కూడా. ప్రస్తుతం పవన్ తన కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపిస్తాడు పవన్.

కథ ప్రకారంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను త్వరలో చిత్రీకరించాలి. వీటిలో పవన్ కొంత సన్నబడాలి కాబట్టి షూటింగ్ కు కొన్ని రోజుల విరామం ప్రకటించారు. ప్రస్తుతం పవన్ సన్నబడడానికి లిక్విడ్ డైట్ ను ఫాలో అవుతున్నాడట. లాస్ట్ టైమ్ ఈ లిక్విడ్ డైట్ ను జానీ సినిమా కోసం ఫాలో అయ్యాడు పవన్ కళ్యాణ్.

ఇక ఈ నెల రెండో వారం నుండి వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి మొదలవుతుంది. శృతి హాసన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా పూర్తైన వెంటనే మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా రీమేక్ షూటింగ్ ను మొదలుపెడతాడు. ఇవి కాకుండా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వాలలో కూడా పవన్ సినిమా చేయాల్సి ఉంది.