20 రోజుల బ్రేక్ తీసుకోనున్న పవన్ – క్రిష్ మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను ముగించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో రెండు పాటలను పూర్తి చేసాడట క్రిష్. గురువారంతో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది.

ఈ షెడ్యూల్ తర్వాత మూవీ యూనిట్ దాదాపు 20 రోజులు బ్రేక్ తీసుకుంటుందిట. నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో మొదలవుతుందని తెలుస్తోంది. మరి ఈ బ్రేక్ టైమ్ లో పవన్ కళ్యాణ్ మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడట. ఆ సినిమా మొదటి షెడ్యూల్ ను ఈలోగా పూర్తి చేస్తాడని సమాచారం. ఇలా వరసగా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయ్యప్పనుము కోషియుమ్ రీమేక్ లో రానా కూడా నటించనున్న విషయం తెల్సిందే.