వకీల్‌సాబ్‌.. పవన్‌ ను హగ్‌ చేసుకున్న ఎన్టీఆర్‌

పవన్‌ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్‌ సాబ్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన వకీల్‌ సాబ్‌ వసూళ్ల విషయంలోనే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న వకీల్‌ సాబ్‌ సినిమాను చూసిన ఎన్టీఆర్‌ సినిమాపై ప్రశంసలు కురిపించి స్వయంగా వెళ్లి పవన్‌ కళ్యాన్ ను ఎన్టీఆర్‌ హగ్‌ చేసుకున్నాడు అంటూ తాజా ఇంటర్వ్యూలో ప్రకాష్‌ రాజ్‌ చెప్పిన విషయం తెల్సిందే.

పవన్‌ కళ్యాన్‌ మనస్థత్వంకు తగ్గట్లుగా వకీల్‌ సాబ్‌ లో ఆయన పాత్ర ఉందని అందుకే అంత బాగా ఆ పాత్రను పండించాడంటూ ప్రకాస్‌ రాజ్‌ చెప్పుకొచ్చాడు. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. పవన్‌ కళ్యాణ్‌ కు ఇంకా పలువురు ప్రముఖ హీరోల నుండి కూడా అప్రిషియేషన్‌ వచ్చిందని ఈ సందర్బంగా ప్రకాష్ రాజ్‌ అనడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈమద్య కాలంలో యంగ్‌ హీరోలు ఒకరిని ఒకరు అభినందించుకోవడం చూస్తున్నాం. పలువురు యంగ్‌ హీరోలు వకీల్‌ సాబ్‌ పై ప్రశంసలు కురిపించడం అభినందనీయం.