తనదైన శైలిలో తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా తనదైన శైలిలో విషెస్ తెలిపాడు. “అవసరంలో ఉన్న వారికి, నీ కుటుంబానికి బెస్ట్ ఇవ్వడంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. నీకు ఎంతటి గిఫ్ట్ ఇచ్చినా అది సరిపోదు” అని రామ్ చరణ్ ట్విట్టర్ లో విష్ చేసాడు. అంతే కాదు వారిద్దరూ కలిసి సంతోషంగా ఉన్న ఫోటోను కూడా షేర్ చేసాడు.

రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. ఎప్పటినుండో ఎంతో సంతోషంగా సాగుతోంది వారి జీవితం. ఉపాసన అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్స్ లో ఒకరన్న విషయం తెల్సిందే. అలాగే సహాయ కార్యక్రమాల్లో తనదైన శైలిలో పాల్గొంటుంది ఉపాసన.

మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే తన తండ్రితో కలిసి ఆచార్య చిత్రంలో కనిపించనున్నాడు.