రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన జెర్సీ దర్శకుడు

మళ్ళీ రావా సినిమాతో ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్న గౌతమ్ తిన్ననూరి, జెర్సీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అదే సినిమాను హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రం డిసెంబర్ 31న విడుదల కాబోతోంది.

గౌతమ్ తిన్ననూరి తన నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఒక స్పోర్ట్స్ డ్రామా అని రూమర్స్ మొదలయ్యాయి. ఈ రూమర్స్ ను అందరూ నమ్ముతుండడంతో గౌతమ్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

రామ్ చరణ్ తో తను చేసే సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని స్పష్టం చేసాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపాడు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో కూడా నటిస్తోన్న విషయం తెల్సిందే.