ఛాలెంజింగ్ రోల్ లో చెలరేగిపోనున్న రావు రమేష్

నటుడు రావు రమేష్ తన కెరీర్ లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాడు. నెగటివ్, పాజిటివ్, కామెడీ అన్న తేడా లేకుండా రావు రమేష్ చాలా పాత్రల్లో మరిపించాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటుడు రావు రమేష్.

తాజా సమాచారం ప్రకారం రావు రమేష్ తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా వస్తోన్న సినిమా మహా సముద్రం. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో రావు రమేష్ గూనివాడి పాత్రలో నటిస్తున్నాడట. నెగటివ్ ఛాయలున్న ఈ పాత్రలో రావు రమేష్ నటన బాగా మెప్పిస్తుందని తెలుస్తోంది.

మహా సముద్రం చిత్రంలో ప్రతీ పాత్రకూ ఒక ప్రత్యేకత ఉంటుందిట. మరి రావు రమేష్ ఏ తరహా నటన కనబర్చాడో తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడక తప్పదు.