రవితేజతో ‘పెళ్లి సందD’ భామ కన్ఫర్మ్‌

ఈ ఏడాది ఆరంభంలో క్రాక్‌ సినిమాతో సక్సెస్ కొట్టిన రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరో వైపు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రవితేజ చాలా నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కమిట్మెంట్స్ ను పూర్తి చేసిన రవితేజ ఇక రెడీ అన్నట్లుగా త్రినాధ రావు నక్కిన కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడట. దాంతో ఆయన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌ పెంచాడు. షూటింగ్ ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌ గా ‘పెళ్లి సందD’ లో రోహన్ కు జోడీగా నటించిన కన్నడ పిల్ల శ్రీ లీల ను ఎంపిక చేయడం జరిగిందట. రవితేజ తో ఆమె స్క్రీన్‌ టెస్ట్‌ ఇతర టెస్ట్ లు కూడా అయిపోయాయి. రవితేజ వంటి మాస్ స్టార్‌ హీరోతో అవకాశం రావడంతో శ్రీలీల వెంటనే ఓకే చెప్పిందట. ‘పెళ్లి సందD’ లో చాలా అందంగా కనిపించడంతో పాటు మంచి నటిగా కూడా ప్రశంసలు అందుకుంది. అందుకే ‘పెళ్లి సందD’ విడుదలకు ముందే మరో ఆఫర్ ను దక్కించుకుంది. రవితేజ మరియు శ్రీలీలల కాంబో మూవీ సక్సెస్‌ అయితే ఆమె బిజీ అవ్వడం ఖాయం.