‘ఆర్ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియో.. జక్కన్న చాలా జాగ్రత్త

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా మేకింగ్ వీడియో తాజాగా విడుదల అయ్యింది. సాదారణంగా అయితే మేకింగ్ వీడియతో కథ విషయంలో కనీసం క్లారిటీ దక్కుతుంది. కాని జక్కన్న విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆర్ ఆర్‌ ఆర్‌ మేకింగ్ వీడియో లో ఎక్కడ కూడా కథ గురించి క్లూ ఇవ్వలేదు. అలాగే హీరోల పాత్రలు మరియు వారి లుక్‌ ల విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

కథ మరియు కథనం విషయంలో ఎలాంటి క్లూ ఇవ్వకుండా సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేసిన ఘనత జక్కన్నకు మాత్రమే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్ ఆర్‌ ఆర్‌ మూవీ మరింతగా అంచనాలు పెంచేలా ఈ మేకింగ్ వీడియో ఉంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. కాని కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల నిలిచి పోయే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు.