అల్లూరి పేరు పెట్టి బ్రిటీష్ పోలీస్ గా ఎలా చూపిస్తారు?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా లో హీరోలను అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ గా చూపించబోతున్నారు. ఈ సినిమా ను ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా వాయిదా వేశారు. ఇక ఈ సినిమా విడుదల రెండు మూడు సంవత్సరాలుగా వాయిదా పడుతున్నాయి. ఈ సినిమా విడుదల విషయమై నెలకొన్న సమస్య చాలదు అన్నట్లుగా ఇప్పుడు పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి.

పెద్ద ఎత్తున విడుదల కోసం రెడీ అవుతున్న ఈ సినిమా లో ఛారిత్రాత్మక హీరోలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో కోర్టు కు అల్లూరి ని బ్రిటీష్ పోలీస్‌ గా చూపించబోతున్నట్లుగా రాజమౌళి ఇప్పటికే చెప్పుకొచ్చారు. కనుక అల్లూరిని ఎలా బ్రిటీష్‌ పోలీసుగా చూపిస్తారు అంటూ కోర్టు లో వ్యాజ్యం దాఖలు అయ్యింది. బ్రిటీష్ వారి కి ధీటుగా పోరాటం చేసిన అల్లూరిని బ్రిటీష్‌ పోలీస్‌ గా ఎలా చూపిస్తారు అంటూ పిటీషనర్‌ కోర్టు ద్వారా రాజమౌళిని ప్రశ్నించాడు.