బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసిన సాయి పల్లవి?

తన న్యాచురల్ నటనకు తోడు అదరగొట్టే డ్యాన్సింగ్ టాలెంట్ ఉన్న సాయి పల్లవి కథాబలం ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నటిస్తోన్న సాయి పల్లవి, నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో రూపొందిన విరాటపర్వం చిత్రాల విడుదలల కోసం ఎదురుచూస్తోంది.

తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవికి ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విధమైన సమాచారం తెలపడానికి సాయి పల్లవి సిద్ధంగా లేదు. స్వయంగా నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేస్తారట.

మరి సౌత్ లో ఆడియెన్స్ ను మెస్మెరైజ్ చేసినట్లే హిందీ ఆడియెన్స్ ను కూడా సాయి పల్లవి మెప్పించగలదేమో చూడాలి.