ఎక్స్ క్లూజివ్: మరో బ్రాండ్ పట్టిన సమంత

టాలీవుడ్‌ స్టార్స్ ఈమద్య కాలంలో రెండు చేతులతో సంపాదిస్తున్నారు. కొందరు అయితే మల్టీపుల్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా సమంత మంచ్‌ చాక్లెట్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది. రెండు రోజుల పాటు మంచ్‌ చాక్లెట్‌ యాడ్‌ షూటింగ్ లో సమంత పాల్గొనబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

మంచ్ చాక్లెట్ యాడ్‌ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఈ యాడ్‌ ను షూట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యాడ్‌ షూట్‌లోనే సమంత పాల్గొంటున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు ఈమె తమిళంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌ గా విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో ఈమె మరో హీరోయిన్‌గా సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో ఈమె శాకుంతలం సినిమాలో కూడా నటించబోతున్న విషయం తెల్సిందే.