పిక్ టాక్ః టెర్రరిస్ట్‌ సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు మరియు పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే చేస్తోంది. మొదటి సారి ఈమె ది ఫ్యామిలీ మాన్ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో కీలక పాత్రలో నటించింది. ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 లో సమంత టెర్రరిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్‌ సిరీస్ కోసం సౌత్‌ ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సమంత పుట్టిన రోజు సందర్బంగా ఈ వెబ్‌ సిరీస్‌ లోని సమంత లుక్ ను దర్శకులు రాజ్ అండ్‌ డీకే రివీల్‌ చేశారు. ఈ వెబ్‌ సిరీస్ లో సమంత డీ గ్లామర్ గా కనిపించబోతుందని ఈ ఫొటో చూస్తుంటే అర్థం అవుతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ వెబ్‌ సిరీస్‌ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. సమంత లుక్ వెబ్‌ సిరీస్ పై అంచనాలు పెంచే విధంగా ఉంది.