సమంత కెరీర్‌లోనే బోల్డ్‌ రోల్‌

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత మొదటి సారి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. రాజ్ అండ్ డీకే ల దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో పాకిస్తానీ ఉగ్రవాది గా సమంత కనిపించబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో సమంతను మరీ బోల్డ్‌ గా చూపించబోతున్నట్లుగా వారు చెబుతున్నారు. సమంతను గతంలో ఎప్పుడు చూడనంత బోల్డ్ గా మీరు ఈ వెబ్‌ సిరీస్ లో చూస్తారని చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ఉగ్రవాదిగా సమంత కనిపించనుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. కాని ఇప్పుడు బోల్డ్‌ అంటూ చెప్పడంతో వెబ్‌ సిరీస్ పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే స్ట్రీమింగ్‌ మొదలు అవ్వాల్సిన ఈ వెబ్‌ సిరీస్ ను కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు దీనిని త్వరలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. వెబ్‌ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు అయ్యాయి. సమంత పాత్ర వెబ్‌ సిరీస్ కు ప్రధాన ఆకర్షణ గా ఉంటే సౌత్‌ ప్రేక్షకులు వెబ్‌ సిరీస్‌ కు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందంటున్నారు.