‘సారంగదరియా’ మరో అరుదైన రికార్డు..! 4 నెలల్లో 25 కోట్లు..

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే ‘సారంగ దరియా..’ పాటతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో తెలిసిన విషయమే. యూట్యూబ్‌లో నెల రోజుల్లోనే 10కోట్ల వ్యూస్ దక్కించుకొన్న ఈ పాట అతి తక్కువ కాలంలోనే 20కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా 25 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పాట విడుదలైన నాలుగు నెలల్లోనే ఈ రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం.

సినిమాలోని పాటలకు పవన్‌ స్వరాలందించారు. రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించిన ఈ పాటలో తెలంగాణ జానపదాలతో రచించారు. పాటను మంగ్లీ ఆలపించిన తీరు, సాయి పల్లవి హుషారు, డ్యాన్సులు పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనాతో వాయిదా పడిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.