డబ్బు కోసం రెండవ పెళ్లి కామెంట్స్ పై సునీత క్లారిటీ

సింగర్ సునీత రెండవ పెళ్లి విషయమై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇన్నాళ్లు ఒంటరి జీవితంను గడిపిన ఆమె పాపం ఇప్పటికి అయినా ఒక మంచి జీవితాన్ని ఆరంభించబోతుంది అంటూ అంతా ఆమెను ఆశీర్వదించారు. కాని కొందరు మాత్రం రామ్ వీరపనేని వంటి బడా వ్యాపారవేత్త లభించడం వల్లే ఆమె పెళ్లికి సిద్దం అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు.

రామ్‌ వీరపనేని ఆస్తులను చూసి ఆమె పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యిందనే వాదన వస్తుంది. తాజాగా ఆ విషయమై ఒక ఇంటర్వ్యూలో సునీత స్పందించింది. తాను రామ్‌ ఆస్తుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అసలు ఇప్పటికి కూడా రామ్‌ ఆస్తుల విషయం నాకు తెలియదు. రామ్‌ ఆస్తులు ఎన్ని ఉన్నాయి.. అతడి వ్యాపారాలకు సంబంధించిన టర్నోవర్‌ ఎంత అనే విషయాలను నేను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.