సుకుమార్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో పూర్తి క్లారిటీ

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విషయంలో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.

సుకుమార్, విజయ్ దేవరకొండతో కాకుండా మరో టాప్ హీరోతో సినిమా చేస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ ఇక అటకెక్కినట్లే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాణ సంస్థ పూర్తి క్లారిటీ ఇచ్చింది. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా తప్పకుండా ఉంటుందని, అనుకున్న ప్రకారమే ప్రాజెక్ట్ మొదలవుతుందని, రూమర్స్ ను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చింది.

సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా రూపొందిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ దేవరకొండ చిత్రం ఉంటుంది. మరోవైపు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చేస్తోన్న విషయం తెల్సిందే.