హీరో సుమంత్ అశ్విన్‌ పెళ్లి సందడి మొదలు

టాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత ఎంఎస్ రాజు ఎన్ని సూపర్‌ హిట్ సినిమాలను నిర్మించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆయన తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా పలు సినిమాలు చేశాడు. నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సుమంత్‌ అశ్విన్‌ పెళ్లి విషయాన్ని ఇటీవలే ఎంఎస్ రాజు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. పెళ్లి పనులు మొదలు అయ్యాయి. తాజాగా వీరి మెహందీ కార్యక్రమం జరిగింది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.

సుమంత్‌ అశ్విన్‌ కు దీపిక కు వివాహం జరుగబోతుంది. ఇన్ని రోజుల నుండి దీపిక ఎవరు ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా మెహందీ వేడుకతో ఆమె ఫొటోలు బయటకు వచ్చేశాయి. సుమంత్‌ అశ్విన్‌ కు తగ్గ జోడీ అన్నట్లుగా దీపిక ఉందని కామెంట్స్ వస్తున్నాయి. వీరి వివాహంను అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా నిర్వహించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. రేపు వైభవంగా సుమంత్‌ అశ్విన్‌ దీపికల వివాహం జరుగబోతుంది.