థమన్ ట్వీట్ తో నానికి పంచ్ వేశాడా?

ఎస్ ఎస్ థమన్ విజయవంతంగా టాప్ ఫామ్ లో దూసుకుపోతోన్న సంగీత దర్శకుడు. ప్రస్తుతం థమన్ వద్ద బోలెడన్ని ప్రామిసింగ్ సినిమాలు ఉన్నాయి. రాధే శ్యామ్ కు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు థమన్. పెద్దగా వివాదాల్లో ఉండని ఎస్ ఎస్ థమన్ కు, న్యాచురల్ స్టార్ నానికి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని బలంగా వార్త ప్రచారంలో ఉంది.

టక్ జగదీష్ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వివాదం తలెత్తిందిట. అది ఇంకా కొనసాగుతోంది. రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సక్సెస్ మీట్ లో చిత్ర విజయాన్ని వన్ మ్యాన్ షో గా ఎప్పుడూ పరిగణించకూడదు. సంగీతం, నటుడి పెర్ఫార్మన్స్ వంటివి సినిమాను డామినేట్ చేయకూడదు. అలా జరిగిందంటే చిత్రం విజయం సాధించనట్లే లెక్క అని అన్నాడు.

ఇప్పుడు థమన్ దానికి కౌంటర్ ట్వీట్ వంటిది వేసాడు. “అవును సినిమా అన్నది వన్ మ్యాన్ షో కాదు. అయితే చిత్రం విజయం సాధించాలంటే అన్ని క్రాఫ్ట్స్ అద్భుతంగా రాణించాలి. దాన్ని డామినేట్ చేసింది అనకూడదు. మాకు సినిమా అంటే ప్రాణం” అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ నానికి ఇన్ డైరెక్ట్ పంచ్ అని అంటున్నారు.