షాకిస్తున్న వరుణ్ తేజ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. తనదైన టాలెంట్తో మెగా ప్రిన్స్గా స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు వరుణ్ తేజ్. ‘ముకుంద’ మూవీతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ‘ఫిదా’తో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ ఎఫ్ 2 గద్దలకొండ గణేష్ చిత్రాలు వరుణ్ క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరో విక్టరీ వెంకటేష్తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ చేస్తున్నాడు.

ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటోంది. అలాగే మరోవైపు వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. ఉపేంద్ర సునీల్ శెట్టి కీలక పాత్రలను పోషించారు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ మొన్నీమధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ వారం రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది.

ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా అలరించబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు వరుణ్ తేజ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇంతకు ముందు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల మేర పారితోషికం అందుకున్న వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు మూవీకి మాత్రం ఏకంగా రూ. 12 కోట్లు డిమాండ్ చేశాడట. వరుస హిట్ లతో దూసుకుపోతుండటంతో.. మేకర్స్ ఆయన ఆడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారని జోరుగా టాక్ నడుస్తోంది.

ఇదే నిజమైతే వరుణ్ తేజ్ కెరీర్లో ఇప్పటి వరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న మూవీ ఇదే అవుతుంది. కాగా ఇదో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమని.. ఇందులో వరుణ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు.