ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో ఎయిర్ ఫోర్స్ పైలట్ గా వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరో రెండు రోజుల్లో వరుణ్ బాక్సర్ గా నటించిన గని విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకుడు. దీని తర్వాత వరుణ్ తేజ్, వెంకటేష్ తో కలిసి చేసిన ఎఫ్ 3 విడుదల కూడా ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

ఇక రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని లాంచ్ చేసిన విషయం తెల్సిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. వీటి తర్వాత వరుణ్ తేజ్ ప్యాన్ ఇండియా సినిమాకు ఫిక్స్ అయ్యాడు.

సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపిస్తాడట. తెలుగు, హిందీలో నిర్మించే ఈ చిత్రం మరిన్ని ప్రధాన భాషల్లోకి డబ్ కానుంది. దసరా తర్వాత ఈ చిత్రాన్ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.