ఇది నిజమైతే.. సాయి పల్లవి రేంజ్ ఎక్కడికో..

చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా సాయి పల్లవి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక చేసేది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని తేడా లేకుండా ఆమె పాత్రలు సెలెక్ట్ చేసుకుంటున్న విధానంతోనే నటనపై ఎంత ఆసక్తిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యారెక్టర్ నచ్చితే రెమ్యునరేషన్ తక్కువైనా సరే చేయడానికి సిద్ధంగా ఉండేవారిలో సాయి పల్లవి ఒకరు.

ఇక ఈ టాలెంటెడ్ నటీమణి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు బాగానే చేస్తుంది కానీ అంతకుమించి అనేలా మరొక రేంజ్ లో అయితే ఇప్పటివరకు అవకాశాలు అందుకోలేకపోయింది ఆమె టాలెంట్ ను కరెక్ట్ గా వాడుకుంటే పెద్ద రేంజ్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని ఫాన్స్ లో ఒక నమ్మకం అయితే ఉంది.

ఇక ప్రస్తుతం ఆమె కెరీర్ ను మలుపు తిప్పే మరొక అద్భుతమైన అవకాశం రాబోతున్నట్లుగా ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో జోడి కట్టబోతున్నట్లుగా ప్రస్తుతం ఒక టాక్ వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఒకవేళ ఇది నిజమైతే ఆమె రేంజ్ పెరిగినట్లే.

దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో చేయబోతున్నాడు. RC 16 గా రానున్న ఆ సినిమా పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. విలేజ్ నేపద్యంలో మొత్తం 1980 కాలం నాటి పరిస్థితులను దర్శకుడు హైలెట్ చేయబోతున్నాడట అందులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఆసక్తిగా ఉండబోతుందట.

ఇక హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని మొదటి ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ స్థాయి పల్లవి పేరు కూడా చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఆ ఆఫర్ ఆమెకు దక్కినట్లయితే పాన్ ఇండియా రేంజ్ లో తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండాలనే కథను రాసుకుని ఉంటాడు. కాబట్టి సాయి పల్లవి లాంటి హీరోయిన్ ను తీసుకోవడం ఉంటే తెరపై మినిమం కంటెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ఈ టాక్ ప్రకారం నిజంగానే ఇందులో సాయి పల్లవి సెలెక్ట్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.