ఒక్కటైన ప్రేమ జంట..!

రీల్ లైఫ్ హీరో హీరోయిన్ సినిమాలో ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం కామనే కానీ అది రియల్ లైఫ్ లో కూడా కొనసాగిస్తే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. సినిమాలో పరిచయం ప్రేమగా మారి హీరో అశోక్ సెల్వన్ హీరోయిన్ కీర్తి పాండియన్ లు పెళ్లితో వారి బంధాన్ని బలం చేసుకున్నారు. వీరిద్దరి మ్యారేజ్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో సందడి చేస్తుంది. దశాబ్ద కాలంగా నటుడిగా తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చిన అశోక్ సెల్వన్ సోలో హీరోగా మారి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. తను చేస్తున్న సినిమాలు సక్సెస్ అవడంతో డిమాండ్ కూడా పెరిగింది.

నటుడిగానే కాదు నిర్మాతగా కూడా తన సినిమాను తానే నిర్మించుకునే రేంజ్ కి వెళ్లాడు అశోక్ సెల్వన్. అశోక్ సెల్వన్ నటించిన బ్లూ స్టార్ సినిమాలో కీర్తి పాండియన్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ లోనే వీరి ప్రేమ చిగురించింది. సినిమా పూర్తయింది వీరిద్దరు పెళ్లి రెడీ అయ్యారు. ఇద్దరు తమ కుటుంబ సభ్యుల అంగీకారం తో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.

కోలీవుడ్ లో స్టార్ హీరోలు ప్రముఖులు కూడా అశోక్ సెల్వన్ కీర్తి లకు గ్రీటింగ్స్ చెబుతున్నారు. అశోక్ సెల్వన్ తెలుగులో నిన్నిలా నిన్నిలా సినిమా చేశాడు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. తెలుగులో విశ్వక్ సేన్ చేసిన ఓరి దేవుడా సినిమా మాత్రుక ఓ మై కడవులే సినిమాలో హీరోగా చేశాడు అశోక్ సెల్వన్.

తన సినిమాలకు తెలుగులో కూడా డిమాండ్ ఉందని తెలుసు పేకమేడ సినిమాతో తెలుగులో కూడా తన టాలెంట్ చూపించడానికి సిద్ధమయ్యాడు అశోక్ సెల్వన్. అశోక్, కీర్తి ల లవ్ మ్యారేజ్ కు సినీ సెలబ్రిటీస్ నుంచి సినీ ప్రేక్షకుల నుంచి గ్రీటింగ్స్ అందుతున్నాయి. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యువ హీరోగా ఉండి ప్రయోగాలు చేస్తూ తమిళంలో సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్నాడు అశోక్ సెల్వన్. ఈ ఇయర్ అతను నటించిన పోర్ తోజిల్ కూడా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

పిజ్జా సీరీస్ లను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న అశోక్ సెల్వన్ వాటితో పాటుగా అన్ని జోనర్ సినిమాలను కూడా తీయాలని చూస్తున్నాడు. సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్న అశోక్ సెల్వన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే ఫాం కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి.