పెళ్లికి రండి కానీ… ఫోనోద్దు!

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆయన కుమార్తే అతియా శెట్టి.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ… కెమెరా కంటికి ఎన్నో సార్లు చిక్కారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ తమ ఫొటోలను షేర్ చేస్తూ… తమ సంబంధం గురించి హింట్ ఇస్తూ వచ్చారు. అయితే వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటారని క్లారిటీ ఇచ్చారు.

కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి ఈ నెలలోనే జరగబోతుందని బాలీవుడ్ మీడియా వర్గాల టాక్. మహారాష్ట్ర ఖండాలలోని సునీల్ శెట్టి నివాసంలో ఇరుకుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితులు అతిథుల మధ్య వీరి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి అని తెలుస్తోంది. వీరి వివాహానికి బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ జాకీ ష్రాఫ్ అక్షయ్ కుమార్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మరికొంతమంది క్రికెట్ సినీ ప్రముఖులు హాజయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

జనవరి 22 న మెహందీ వేడుకతో పాటు ఫ్రీ వెడ్డింగ్ పనులు జరగనున్నాయి. ఈ వేడుక సునీల్ శెట్టి నివాసంలో ఖండాలలో జరగనుంది. కేల్ రాహుల్ అతియాశెట్టి తరపు బంధువులు 100 మంది దాకా వచ్చే అవకాశం ఉంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వారికి మొబైల్ ఫోన్ అనుమతి లేదని తెలుస్తుంది. పెళ్ళిలో ఫోటోలు వీడియోలు తీయకుండా ఉండేందుకు ఈ కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఇదే తరహాలో బాలీవుడ్ జంట విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ పెళ్లి జరిగింది. వారి వివాహంలో కూడా అతిథులు ఫోన్లను దూరంగా ఉంచారు. ఇక వివాహం జరిగిన వారం తర్వాత ఈ జెండా సన్నిహితుల కోసం ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనుంది. పెళ్లికి రిసెప్షన్ కి స్నేహితులు సన్నిహిత వర్గాలు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది.