మెగా ఫ్యామిలీలో మరో వేడుక.. పెళ్లి ఫిక్సా?

మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం వరుసగా బిగ్ సెలబ్రేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఓ విధంగా గత రెండేళ్ల నుంచి వారి ఫ్యామిలీకి అన్ని మంచి శకునములే అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. తరువాత మెగా ఫ్యామిలీలోకి రామ్ చరణ్ వారసురాలిగా క్లింకార వచ్చింది. పదేళ్ల తర్వాత మెగాస్టార్ తాతయ్య అయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది.

దేశంలోనే అత్యున్నత పురస్కారాలతో పద్మవిభూషణ్ ఒకటి కావడం విశేషం. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలుపొందింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవికి సాధ్యం కానీ రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ సాధించారు.

ఇలా ఒకదాని తర్వాత ఒక అన్ని సంతోషకరమైన సంఘటనలే జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయంట. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని టాక్ వైరల్ అవుతోంది. తేజ్ చివరిగా విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వీటిలో విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హనుమాన్ ప్రొడ్యూసర్ తో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ కూడా రోల్ అవుట్ కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా బడ్జెట్ కారణాల వలన ఆగిపోయినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రాలేదు.

అయితే మరోవైపు సాయి తేజ్ పెళ్లి గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో తేజ్ ఒక హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడంటూ కొన్ని పేర్లు వినిపించాయి. అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. ఓ వ్యాపార వేత్త కూతురుతో పెళ్లి నిశ్చయం అయినట్లు టాక్.

పెద్దలు చూసిన అమ్మాయినే సాయి తేజ్ పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. త్వరలో దీనికి సంబందించిన న్యూస్ ని మెగా ఫ్యామిలీ బయటపెట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో తేజ్ కూడా చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. మరి వైరల్ అవుతున్న గాసిప్స్ కు మెగా మేనల్లుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.