చెర్రికి తలనొప్పిగా మారిన ఇండియన్ 2

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ బ్రాండ్ తో దూసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో పాన్ నడియా లెవల్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగానే దీనిని తెరకెక్కుస్తున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ మూవీ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ మూవీతో పాటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఆ మూవీని వీలైనంత వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనే శంకర్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఈ నేపధ్యంలో గేమ్ చేంజర్ షూటింగ్ కి ప్రస్తుతం కొంత గ్యాప్ ఇచ్చి ఇండియన్ 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఇదే రామ్ చరణ్ కి తలనొప్పిగా మారిందనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. నిజానికి శంకర్ సినిమా వేగంగా కంప్లీట్ చేసి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నారు.

అయితే శంకర్ మాత్రం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కి ఎక్కువ గ్యాప్ ఇస్తున్నారు. అతని ఫస్ట్ ఫోకస్ అంతా కూడా ఇండియన్ 2 మీదనే ఉండటంతో చెర్రి మూవీ డిలే చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అయితే దిల్ రాజు మాత్రం గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు.

ఏది ఏమైనా శంకర్ తో చేస్తోన్న గేమ్ చేంజర్ సినిమా చెర్రి స్పీడ్ కి బ్రేక్స్ వేస్తోందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కారణంగా బుచ్చిబాబు మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడం కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.