సూర్య, కార్తీ సోదరి గురించి మీకు ఈ విషయం తెలుసా..!

తమిళ స్టార్ హీరోలు సూర్య మరియు కార్తీల సోదరి బృంద శివ కుమార్‌. తమిళ సినీ ప్రేక్షకులకు బృంద వాయిస్‌ సుపరిచితం. ఎన్నో పాటలు పాడటంతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్స్ కి బృంద తన గొంతు అరువు ఇచ్చి పాత్రలకు ప్రాణం పోసింది.

తెలుగు లో బృంద గురించి పెద్దగా పరిచయం లేదు. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెళ్లడించింది. తనకు చాలా కాలం క్రితం మణిరత్నం నుంచి సినిమా ఆఫర్‌ వచ్చింది. ఆయన చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించాల్సిందిగా ఆహ్వానం వచ్చిందని తెలియజేసింది.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్ చిత్రం కన్నతిల్‌ ముత్తమిట్టల్‌ ( తెలుగు లో అమృత) లో హీరోయిన్ గా నటించే అవకాశం మొదట బృంద వద్దకు వచ్చిందట. ఆ సమయంలో నటనపై ఆసక్తి లేకపోవడంతో బృంద తనకు వచ్చిన మణిరత్నం ఆఫర్‌ కి నో చెప్పిందట.

అప్పట్లో సౌత్‌ స్టార్‌ హీరోల కూతుర్లు హీరోయిన్స్ గా నటించేందుకు ఆసక్తి చూపించే వారు కాదు. కానీ ఈ మధ్య మాత్రం తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్‌ హీరోల కిడ్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. బృంద అప్పట్లో అమృత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే తప్పకుండా మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకునేది.