మలయాళ సూపర్ హిట్ తెలుగు రీమేక్ కు సూపర్ టైటిల్

తాజాగా మలయాళ సినిమాలపై తెలుగు వారి కన్ను పడింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక లూసిఫెర్ ను చిరంజీవి రీమేక్ చేయనున్నాడు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని రవితేజతో తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సితార ఎంటర్టైన్మెంట్స్ మరో మలయాళ చిత్రం కప్పెల చిత్ర హక్కులను కొనుగోలు చేసారు. అన్నే బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాధ్యు నటించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ రీమేక్ కు సంబంధించి కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు తెలుగులో బుట్టబొమ్మ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే బయటకు రానుంది.