యూట్యూబ్‌ శివ వ్యాఖ్యలతో జబర్దస్త్‌ అనసూయ వాకౌట్‌

తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే అందరు ఠక్కున గుర్తు చేసుకునే షో జబర్దస్త్‌ కామెడీ షో. అనసూయ హోస్ట్‌ గా ఈ షో కు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. అనసూయ జబర్దస్త్‌ ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ అయితే ఈమెను చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు. పిల్లలు పెద్ద వారు అయిన ఈ సమయంలో కూడా పొట్టి నెక్కర్లు ఏంటీ అంటూ విమర్శలు చేస్తున్నారు. వాటికి పలు సందర్బాల్లో తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చిన అనసూయ మరోసారి ఆ ప్రస్థావనతో ఏకంగా జబర్దస్త్‌ సెట్‌ దిగి వెళ్లి పోయింది.

యూట్యూబ్‌ లో టిక్ టాక్, ఇన్ స్టా ఇంకా సోషల్‌ మీడియా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఉండే శివ ఈమద్య చాలా ఫేమస్ అయ్యాడు. ఆయన ను ఆది తన స్కిట్‌ కోసం తీసుకు వచ్చాడు. ఆ సమయంలో శివ మాట్లాడుతూ అనసూయ గారు మీ డ్రెస్ గురించి జనాలు తప్పుగా మాట్లాడుకుంటు ఉన్నారు అంటే వారు తెలియక మాట్లాడితే మీరు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు అది నా పర్సనల్‌ అంది. పర్సనల్‌ అయితే ఇంట్లో చూసుకోవాలి కదా అంటూ శివ మరింత రెట్టించడంతో అనసూయ కు కోపం వచ్చింది. ఆది వైపు చూస్తు ఏంటీ ఇది అంటూ సీరియస్‌ గా వెళ్లి పోయింది. యూట్యూబ్‌ లో ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండ్డింగ్‌ అవుతోంది. వచ్చే వారం అసలు ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది.