ఆదాయం లేక పన్ను చెల్లించలేక పోతున్నా

బాలీవుడ్‌ వివాదాస్పద నటి.. ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కొనసాగుతూ ఉంటుంది. తాజాగా ఆమె మీడియాలో మళ్లీ నిలిచింది. ఈసారి పన్ను చెల్లించే విషయంలో ఆమె పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాదికి గాను కంగనా పన్ను చెల్లించలేదట. ఆమె పన్ను చెల్లించే విషయంలో ఎప్పుడు కూడా సక్రమంగా ఉంటుంది. కాని ఈసారి మాత్రం ఆమె పన్ను చెల్లించలేదు అంటూ టాక్ వస్తున్న సమయంలో స్వయంగా కంగనా స్పందించింది.

ఇండస్ట్రీలో నేను అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్స్‌ లో ఒకరిగా నిలుస్తాను. నా ఆదాయంలో ఏకంగా 45 శాతం వరకు నేను పన్ను చెల్లిస్తున్నాను. అలాంటి నేను ఈసారి పన్ను చెల్లించలేక పోయాను. గత ఏడాదిలో కరోనా కారణంగా సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల నేను పన్ను చెల్లించలేక పోయాను. గత ఏడాది పన్ను చెల్లించని కారణంగా నేను అదనంగా ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అయినా నేను దానికి సిద్దంగానే ఉన్నాను. పరిస్థితులు అనుకూలించిన వెంటనే నేను పన్ను చెల్లిస్తానంటూ ముందస్తుగా తనపై వస్తున్న విమర్శలకు సమాధానంను కంగనా చెప్పింది.