యువ హీరో నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామాలో పాపులర్ మోడల్

మోడల్ కేతిక శర్మ అడ్వర్టైజ్మెంట్ లోకంలో చాలా పాపులర్. ఇప్పటికే పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది ఈ భామ. ఈ హాట్ టాలెంట్ ను పూరి కనెక్ట్స్ సంస్థ గుర్తించింది. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా తెలుగులో పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే రొమాంటిక్ కు సంబంధించి కొన్ని టీజర్లు విడుదల చేయగా వాటిలో ఈ భామ తన హాట్ నెస్ తో ఆకట్టుకుంది. రొమాంటిక్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే రొమాంటిక్ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు.

ఇంకా తొలి సినిమా కూడా విడుదల కాకుండానే కేతిక శర్మ తన రెండో సినిమాను చేజిక్కించుకుంది. నాగ శౌర్య హీరోగా ఒక స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సంతోష్ జాగర్లపూడి అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను శరత్ మరార్, రామ్ మోహన్, సునీల్ నారంగ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకున్నారు నిర్మాతలు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలుపెట్టనున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి