#RRR టీజర్‌ అప్‌డేట్‌.. ప్రతి రోజు ట్రెండింగ్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే జనవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల కు ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గత రెండు మూడు రోజులుగా అదుగో టీజర్ అప్డేట్‌ ఇదుగో టీజర్ అప్‌డేట్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. దీపాళికి ముందే టీజర్ ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారు.

టీజర్ అప్‌డేట్‌ ఏమో కాని ప్రతి రోజు కూడా ఆర్ ఆర్ ఆర్‌ సినిమా కు సంబంధించిన ఏదో ఒక అంశం ఇండియా వైడ్‌ గా ట్విట్టర్ లో టాప్ లో ట్రెండ్‌ అవుతోంది. నేడు కూడా కొమురం భీమ్ అంటూ ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్‌ లో ఉంది. నేడు లేదా రేపు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా టీజర్ అప్ డేట్ వచ్చే అవకాశాలు నిజంగానే ఉన్నాయంటున్నారు. టీజర్‌ ను దీపావళికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాని ముందుగానే విడుదల చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగబోతుంది అనేది చూడాలి.