దసరాను టార్గెట్ చేస్తోన్న సీనియర్ హీరోలు

కోవిద్ కారణంగా మరోసారి సినిమాల రిలీజ్ డేట్లు తారుమారయ్యాయి. షెడ్యూల్ చేసిన రిలీజ్ డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు వెనక్కి వెళుతున్నాయి. మే నెలలో ముగ్గురు సీనియర్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలనుకున్నారు. మే 13న వెంకటేష్ నటించిన నారప్ప, మే 14న చిరంజీవి ఆచార్య, మే 28న నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలను విడుదలకు షెడ్యూల్ చేసారు. అయితే ఈ చిత్ర రిలీజ్ డేట్లు అన్నీ వాయిదా పడ్డాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలు మళ్ళీ తలపడబోతున్నాయి. దసరాకు ఈ మూడు చిత్రాలు విడుదలయ్యే నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అంటే దసరా పండగ సమయంలో నారప్ప, అఖండ, ఆచార్య చిత్రాలు విడుదల కానున్నాయి.

ఇలా సీనియర్ హీరోలు ముగ్గురూ ఒకేసారి తలపడడం అనేది ఈ మధ్య కాలంలో జరిగింది లేదు. అయితే ఇది జరుగుతుందా లేదా అన్నది చూడాలంటే మరికొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయక తప్పదు.