సామ్ బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్దం

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా మారబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సామ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా హిందీలో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. వెబ్ సిరీస్ సక్సెస్ అవ్వడంతో పాటు ఆమెకు నటిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. దాంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. సామ్ ఇటీవల ఒక బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ ఓకే అవ్వడంతో సామ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక పెద్ద సినిమాతోనే సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తి అయ్యాయి.

ఒక మంచి సమయం సందర్బం చూసి సినిమాకు సంబంధించిన విషయాలను అధికారికంగా వెళ్లడించడం కోసం సామ్ వెయిట్ చేస్తుందట. బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసమే సమంత ఈమద్య కాలంలో తెలుగు లో కాని తమిళంలో కాని సినిమాలకు ఓకే చెప్పలేదు. బాలీవుడ్ లో ఇప్పటికే వెబ్ సిరీస్ తో సక్సెస్ ను దక్కించుకున్న సమంత త్వరలోనే సినిమా ద్వారా కూడా సక్సెస్ కొట్టి అక్కడ ఇతర హీరోయిన్స్ మాదిరిగా బిజీ అవ్వాలని ఆశ పడుతోంది. ఆమె ఖచ్చితంగా ఒక మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. సామ్ సినిమాల ఎంపిక విషయంలో గత కొన్నాళ్లుగా ఆచితూచి వ్యవహరిస్తుంది.

సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అనే తేడా లేకుండా పాత్ర కు మంచి ప్రాముఖ్యత ఉంటే ఖచ్చితంగా చేసేందుకు ముందుకు వస్తోంది. చైతూ నుండి విడిపోయేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత సమంత తన పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టబోతుంది. అందుకోసం హిందీ సినిమాలను ఎంపిక చేసుకోవాలని.. సౌత్ నుండి దూరంగా వెళ్లాలని ఆమె భావిస్తుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో సౌత్ స్టార్స్ పలువురు బాలీవుడ్ బాట పడుతున్నారు. అందుకే సమంత కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ను బాలీవుడ్ లో దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె మొదటి సినిమా కోసం ఎదురు చూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు.