కొత్తవి కనిపెట్టి చుక్కలు చూపిస్తున్న సామ్!

నటి సమంత ఫిట్ నెస్ ప్రియురాలు. యోగా..జిమ్ వీడియోలతో నెట్టింట నిరంతరం సందడి చేస్తూనే ఉంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఒంటరి జీవితాన్ని.. మదిలో బాధని తొలగించుకుకోవడానికి చుట్టూ స్నేహితుల వాతావరణాన్ని పెంచుకుంటుంది. తాజాగా తన ఫిట్ నెస్ ఆసక్తిని ఆ చుట్టూ ఉన్న వారిపైనా రుద్దుతోందని ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. `లెవెల్ ఆఫ్ ఛాలెంజ్` అంటూ సామ్ వీడియోని షేర్ చేసింది. ఇందులో సమంత కప్పగెంతులాంటి వింత ఛాలెంజ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. నేలపై అలా కాళ్ల మీదనే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.

ఇప్పుడా ఛాలెంజ్ ని సామ్ మేకప్ ఆర్టిస్ట్..ట్రైనర్ అందరూ స్వీకరించారు. ముందుగా ఈ ఛాలెంజ్ ని హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కార్ ట్రై చేసి ఫెయిలయ్యాడు. ఆ తర్వాత మూడు..నాలుగు ప్రయత్నాల తర్వాత సక్సెస్ అయ్యాడు. అటుపై మేకప్ ఆర్టిస్ట్ రంభియా ట్రై చేసి వెనక్కి పడ్డాడు. ఆ తర్వాత ప్రీతమ్ జుకల్కర్ ఎంత ప్రయత్నించినా ఛాలెంజ్ ని పూర్తిచేయలేకపోయాడు. ఈ విషయంలో అందరికీ ట్రైనర్ సమంతనే. ఆమె మాత్రం చాలా వీజీగా చేసేసింది. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు అంతా కరిగిపోతుందిట. కానీ చేయడం మాత్రం అంత సులభం కాదు. కాలి పాదల దగ్గర నుంచి కళ్ల వరకూ కదులుతంటూ చుక్కలు కనిపించిపోతాయి. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం.

ఇక సమంత బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. `ఫ్యామిలీ మ్యాన్ -2` వెబ్ సిరీస్ తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న `స్పిన్ ఆప్ సిటాడెల్ `అనే మరో వెబ్ సిరీస్ కి కమిట్ అయింది. ఇందులో సామ్ గుఢచారి పాత్రలో కనిపించనుంది. వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సరీస్. ఇలా సమంతా సినిమాలతలో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ జోరు చూపిస్తోంది. ఇక తెలుగులో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `శాకుంతలం` లో నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. అలాగే `యశోద` అనే మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రంలోనూ నటిస్తోంది.