భ‌ర్త‌ను చిత‌క్కొట్టిన బాలీవుడ్ బ్యూటీ

ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ను బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి చిత‌క్కొట్టింది. తన బాయ్‌ఫ్రెండ్, దుబాయ్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ను శిల్పాశెట్టి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో సెల‌బ్రిటీలు ఇంట్లోనే ఉంటూ సోష‌ల్ మీడియాలో త‌మ రోజువారీ ప‌నుల గురించి అభిమానుల‌తో పంచుకుంటున్నారు. శిల్పాశెట్టి ఎప్పుడూ స‌ర‌దాగా ఉంటూ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా త‌న భ‌ర్త‌ను స‌ర‌దాగా చేతుల‌తో బాదుతూ చేసిన టిక్‌టాక్ వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

అస‌లే శిల్పాశెట్టి. ఒక‌ప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో ఓ రేంజ్‌లో హీరోయిన్‌గా కుర్ర‌కారును మ‌త్తెక్కించింది. అందాల ఆర‌బోతలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్న ఈ బాలీవుడ్ భామ త‌న భ‌ర్త రాజ్‌కుంద్రాను కొడుతూ టిక్‌టాక్ చేయ‌డం హాస్యం పండించింది. ఈ వీడియోలో శిల్పా భ‌ర్త రాజ్‌కుంద్రా త‌న‌తో పాటు త‌న మ‌నిషిని విసిగిస్తూ క‌నిపిస్తాడు. దీంతో శిల్పా ఆగ్ర‌హానికి గురై రాజ్‌కుంద్రాను బాగా కొడుతుంది. ఈ టిక్‌టాక్ వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

స‌హ‌జంగా నెటిజ‌న్లు, అభిమానులు త‌మ అభిమానుల చిలిపి చేష్ట‌ల‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇపుడు శిల్పా శెట్టి కూడా త‌న చిలిపి చేష్ట‌ల‌తో చేసిన టిక్‌టాక్ వీడియో కూడా నెటిజ‌న్లు, అభిమానుల మ‌న‌సుల‌ను కొల్ల‌గొడుతోందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. శిల్పా కోరి కోరి మ‌నువాడిన భ‌ర్త‌ను చిత‌క్కొడుతోంద‌ని నెటిజ‌న్లు స‌ర‌దా కామెంట్ చేస్తున్నారు.