బాయ్ ఫ్రెండ్ గురించి తడుముకోకుండా చెప్పేసిన స్టార్ హీరోయిన్..!

‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్ లో కంబ్యాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. అలానే సమయం దొరికినప్పుడల్లా ముంబై వీధుల్లో తన కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.

శ్రుతి హాసన్ గతంలో లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి అమ్మడు శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శృతి తన ప్రియుడికి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంటుగా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో చాట్ సెషన్ నిర్వహించిన సలార్ బ్యూటీ.. ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

ఈ సందర్భంగా శాంతను హజారికాను ఎప్పుడు కలుసుకుందనే విషయాన్ని శృతి వెల్లడించింది. దీనికి ఆమెతో పాటుగా బాయ్ ఫ్రెండ్ శాంతను కూడా ఫన్నీగా స్పందించాడు. ”మీరు శంతనుని ఎప్పుడు కలిశారు?” అని ఓ అభిమాని క్రాక్ బ్యూటీని ప్రశ్నించారు.

దీనికి శృతి స్పందిస్తూ.. “శాంతను గురించి నాకు 2018లోనే తెలుసు. కానీ మేము 2020లో కలుసుకున్నాం” అని చెప్పింది. ఈ సమయంలో పక్కనే ఉన్న శాంతను కలుగజేసుకుంటూ.. ‘దయచేసి నా పేరును సరిగ్గా పలకండి. అందులో హెచ్ లేద’ అని నెటిజన్ ని కోరాడు.

మరొక అభిమాని తన ఫేవరేట్ పర్సన్ పేరు చెప్పమని అడుగగా.. శృతి హాసన్ కెమెరాను శాంతను వైపు తిప్పింది. అయితే శృతి తనను అడుగుతుందని భావించిన శాంతను ‘క్లారా’ అని చెప్పాడు. దీంతో అది పర్సన్ కాదని.. అది కిట్టి అని శృతి వాదించింది. ఎందుకంటే క్లారా అనేది శ్రుతి కిట్టి పిల్లి పేరు. అయితే అది శృతికి సంబంధించిన వ్యక్తి అని శాంతను కౌంటర్ ఇచ్చాడు.

ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్ లో శ్రుతి హసన్ తనకు ఇష్టమైన శరీర భాగం నుండి ఆమెకు ఇష్టమైన సౌత్ ఇండియా వంటకం.. ఇష్టమైన ఫ్రూట్ వంటి విషయాల వరకు వెల్లడించింది. ఫేవరేట్ ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె పక్కనే ఉన్న శాంతను కూడా సంభాషణలో పాల్గొన్నాడు.

శ్రుతికి ఇష్టమైన ఫ్రూట్ సీతాఫలం అని.. వాటిని ఎక్కువగా ఇష్టపడుతుందని వెల్లడించాడు. పండ్లలో ఇంకా ఏమి ఇష్టపడతారని ఆమె శాంతనుని అడుగగా.. వెంటనే అతను చెర్రీ అని సమాధానం ఇచ్చాడు. దీనికి శృతి హాసన్ అంగీకరిస్తూ తలాడించింది.

ఇదిలా ఉంటే శృతిహాసన్ – శాంతనూ హజారికా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలపై ఆ మధ్య శృతి స్పందించింది. తన దగ్గర ఎలాంటి రహస్యాలు లేవని.. పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే మరుక్షణమే అది అందరికీ చెప్పేస్తానని.. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని చెప్పింది శృతి.

శాంతనూ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఒక ప్రతిభగల ఆర్టిస్ట్ అని తెలిపింది. సంగీతం కళలు సినిమాల విషయాలలో తమ అభిప్రాయాలు చాలా బాగా కలిశాయని.. తనతో కలిసి సమయం గడపడం చాలా ఇష్టమని.. అలాగే తనంటే చాలా గౌరవం కూడా ఉందని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘క్రాక్’ ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాల్లో నటించిన శృతి హాసన్.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘సలార్’ సినిమా చేస్తోంది. అలానే నందమూరి బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటించనుంది.