స్టాలిన్ కూడా నన్ను వాడుకున్నాడు అంటోన్న శ్రీరెడ్డి

సినిమాల వరకూ వివాదం అన్న పదం రాగానే కచ్చితంగా గుర్తొచ్చే పేరు శ్రీరెడ్డి. ఈమె నటించిన సినిమాల సంగతి పక్కనపెడితే వివాదాలతోనే ఎక్కువగా ఫేమ్ ను సంపాదించుకుంది. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద విమర్శలు చేయడం వారిని ఘాటు మాటలతో ఇరుకునపెట్టడం శ్రీరెడ్డికి చాలా మాములు విషయం. గతంలో చాలా మంది హీరోలు తనకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వాడుకున్నారని, ఎవరూ అవకాశాలు ఇప్పించలేదని వాపోయింది శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలో నాని నుండి విశాల్ వరకూ చాలా మంది పేర్లు వాడేసింది.

తాజాగా శ్రీరెడ్డి తమిళ హీరో కమ్ రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు చేసింది. విశాల్ ద్వారా స్టాలిన్ తనకు పరిచయమయ్యాడని, తనతో రాత్రంతా ఒక హోటల్ లో గడిపానని, అవకాశాలు ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ఉదయనిధి ఇటీవలే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.