వకీల్‌ సాబ్‌ తో థమన్ రేటు ఎంత పెరిగిందో తెలుసా?

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్ లో ప్రస్తుతం థమన్ హవా కొనసాగుతోంది. అల వైకుంఠపురంలో సినిమాకు ముందు వరకు ఆయన గురించి రకరకాలుగా పుకార్లు ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం ఆయన నెం.1 మ్యూజిక్‌ కంపోజర్ గా దూసుకు పోతున్నాడు. అల వైకుంఠపురంలో సినిమాకు ముందు కోటి లోపు పారితోషికంను అందుకున్న థమన్‌ ఆ తర్వాత కోటి ఆపై పారితోషికంను దక్కించుకున్నాడు. వకీల్ సాబ్‌ కు ముందు దాదాపుగా కోటిన్నర పారితోషికంను తీసుకున్న ఆయన ఇప్పుడు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.

వకీల్‌ సాబ్‌ సినిమాలో పాటలకు పెద్దగా ప్రాముఖ్యత లేవు. అయినా కూడ ఆ మగువ పాటతో పాటు మరో రెండు పాటలను కూడా అద్బుతంగా ట్యూన్స్‌ ఇచ్చాడు. ఇక వకీల్ సాబ్‌ లో బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కు మంచి స్పందన వచ్చింది. కనుక ఆయన్ను ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చి మరీ బుక్‌ చేసుకుంటున్నారు. సినిమా బడ్జెట్‌ ను బట్టి ఆయన పారితోషికం ను తీసుకుంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి. చిన్న సినిమాలకు కోటి కి మించి తీసుకుంటూ పెద్ద సినిమాలకు రెండు కోట్లకు పైగా తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.