అనిరుధ్‌ తో పెళ్లి… కీర్తి సురేష్ ఏమన్నదంటే!

మహానటి ఫేం కీర్తి సురేష్‌ పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య చెన్నై కి చెందిన ఒక బిజినెస్ మెన్ తో కీర్తి సురేష్ వివాహం జరుగబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు నిజం కాదని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదని కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

కీర్తి సురేష్ పెళ్లి గురించి ఆ మధ్య వార్తలు రాలేదు. కానీ ఈ మధ్య మళ్లీ పెళ్లి వార్తలు సందడి చేస్తున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్ తో కీర్తి సురేష్ ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ మరియు అనిరుధ్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఆ ఫోటోలు చూసిన చాలా మంది కూడా వీరిద్దరి పెళ్లి వార్తలు నిజమేనేమో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమేనట. ఈ వార్తల మీద ఇప్పటికే కీర్తి తండ్రి ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు కీర్తి కూడా ఇది తప్పుడు వార్తలు అని సమాధానం ఇచ్చింది, కీర్తి సురేష్ మాట్లాడుతూ.. పెళ్లి గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే. మేము ఇద్దరం మంచి స్నేహితులం. అతడు ఒక మంచి స్నేహితుడు. అంతకు మించి ఏం లేదు అని పేర్కొంది.

మీడియాలో వార్తలను ప్రచురితం చేసే సమయంలో క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు ఈ విషయమై అసహనం వ్యక్తం చేస్తున్నారు.