ఐశ్వర్యారాయ్ కి-ఊర్వశి రౌతేలాకి తేడా తెలియలేదా?

అతిలోక సందురి శ్రీదేవి తర్వాత అంత పాపులర్ అయిన అందగత్తె ఐశ్వర్యారాయ్. ఈ బ్యూటీ అందానికి మంత్ర ముగ్దులు కానిది ఎవరు? ఐసూ… ఐస్ అంటూ నిత్యం ఆమె నామ జపం యువతలో జరుగుతూనే ఉంటుంది.

ఐశ్వర్యా రాయ్ సినిమాలు చేయకపోయినా? ఆ పేరు అంటేనే ఓ వైబ్రేషన్. పెళ్లైనా తర్వాత.. పిల్లలకు తల్లైన తర్వాత కాస్త అందం తరిగినట్లు అనిపించినా..బోద్దు గా కనిపించినా పాత ఐస్ ని స్మరించుకుని యువత ఎంత మంది? అలాంటి అందగత్తె విషయంలో కేన్స్ ఫోటోగ్రాఫర్లు రెడ్ కార్పెట్ వద్ద ఎలా కన్ ప్యూజ్ అయ్యారో తెలిస్తే! షాక్ అవుతాం.

కేన్స్ ఉత్సవాల్లో భాగంగా భారతీయ భామ మణులు రెడ్ కార్పెట్ పై డిజైనర్ దుస్తుల్లో ఒదిగిపోయారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవ్సతరం కూడా ఐశ్వర్యా రాయ్ వేడకల్లో పాల్గొంది.

రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ అందమైన వాకింగ్ తో ఆకట్టుకుంది. అయితే అంతకు ముందే ఊర్వశి రౌతేలా కూడా అదే కార్పెట్ పై హోయలు పోయింది. దీంతో ఒక్కసారిగా ప్రెంచ్ ఫోటోగ్రాఫర్లు ఐశ్వర్య ఐశ్వర్య అంటూ పిలిచే సరికి ఊర్వశికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాలేదు.

ఊర్వశి ని పట్టుకుని ఐశ్వర్య అంటున్నారేంటి? అని కంగారు పడింది. కానీ ఆ సమయంలో కామ్ గా ఉంది. తాను ఎవరు అన్నది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత కాసేపటికి ఈమె ఎవరో? కొత్తగా ఉన్నారంటూ ఫోటోగ్రాఫర్లు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. కేన్స్ ఉత్సవాల్లో ప్రతీ ఏడాది ఐశ్వర్యా రాయ్ రెడ్ కార్పెట్ పై తప్పక మెరుస్తుంది. ప్రత్యేక హాదాలో అక్కడికి హాజరువుతుంటుంది.

డిజైనర్ దుస్తుల్లో ఐస్ మెరుపులు ఏటా సమ్ థింగ్ స్పెషల్ గా నిలుస్తాయి. ఎంతో మంది విదేశీ భామలు రెడ్ కార్పెట్ పై మెరిసినా! ఐస్ వచ్చిందంటే? ఆ వేదిక స్వరూపమే మారిపోతుంది. కేన్స్ ఉత్సవాలకే ఓ బ్రాండ్ గా నిలుస్తుంది.