తాప్సి కొత్త కారు ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్‌ లో ఝుమ్మంది నాధం సినిమా తో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తాప్సి హిట్ పడకున్నా అదృష్టం కొద్ది పలు సినిమాల్లో నటించే ఛాన్స్ లు దక్కించుకుంది. టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రావు అనుకున్న తాప్సి బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది. అక్కడ అదృష్టం కొద్ది స్టార్‌ హీరోయిన్స్ సరసన నిలిచే సినిమాల్లో నటించింది.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా తాప్సి కి గుర్తింపు లభించింది. ఒక వైపు సినిమాల్లో హీరోయిన్‌ గా బిజీ బిజీగా ఉన్నా కూడా నిర్మాణం పై కూడా ఈ అమ్మడు శ్రద్ద పెట్టింది. బాలీవుడ్‌ కి వెళ్లిన తర్వాత తాప్సి ఆదాయం భారీగా పెరింది. అందుకు తగ్గట్లుగానే ఆమె మెయింటెన్స్ ని పెంచిందని బాలీవుడ్‌ మీడియా వారు మాట్లాడుకుంటున్నారు.

తాప్సి గ్యారేజ్ లో ఇప్పటికే పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మెర్సిడెస్‌ బెంజ్‌ జిఎల్ఎస్ 600 వచ్చి చేరింది. ఆదివారం తాప్సి కొత్త కారును ఆమె ఇంటి వద్ద షో రూం అధికారులు అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ కారు ధర గురించి సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బెంజ్ కార్లలో అత్యంత ఖరీదైన కారు గా ఈ కారును చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం బెంజ్ జిఎల్‌ఎస్ 600 కారు ధర దాదాపుగా రూ.3.15 కోట్లుగా మార్కెట్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఈ రేటు చాలా మందికి షాకింగ్ గా ఉంది. కారులో అత్యధునిక ఫీచర్స్ ఉండటంతో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లో కూడా చాలా అధునాతన హంగులు ఉన్నాయి అన్నట్టుగా కంపెనీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి తాప్సి ఈ కారుని కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆమె ఏ రేంజ్ లో సంపాదిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా బాలీవుడ్‌ లోనే ఈమెకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో అన్ని రకాల పాత్రల్లో కనిపిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు లేకపోలేదు.