నేను ఎలా ఉన్నా అందంగా ఉంటాను!-షారూఖ్

‘పఠాన్’ రిలీజ్ ముందు కింగ్ ఖాన్ షారూఖ్ తన అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నాడు. ఈ సెషన్ కి ఒక అంతరాయం కలిగించి స్మార్ట్ గా తెలివైన ముగింపుని ఇచ్చాడు. రిలీజ్ డేకి ఒక రోజు ముందు పఠాన్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీపికా పదుకొణె నటించిన ప్రమోషనల్ వీడియోని విడుదల చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోకి రకరకాల కామెంట్లు వచ్చి పడ్డాయి. మార్ఫింగులు వైరల్ అయ్యాయి.

2012లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నుండి షారూఖ్ ఖాన్ ముఖ చిత్రాన్ని దీపిక పదుకొనే తాజా వీడియో లేదా ఫోటోకి మార్ఫ్ చేసి నెటిజనులు ‘ఫెమ్మే ఫాటేల్’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు షేర్ చేసారు. అటుపై షారుఖ్ ఖాన్ -దీపికా పదుకొణెలపై విపరీతమైన ట్రోలింగ్ సాగింది. కానీ ఇవేవీ పట్టనట్టుగా ఇప్పుడు కింగ్ ఖాన్ రెట్టించిన ఉత్సాహంతో దీపికతో కలిసి పఠాన్ గా తిరిగి థియేటర్లలోకి వచ్చాడు.

అయితే సామాజిక మాధ్యమాల్లో తన లేడీ గెటప్ షేరింగ్ ని వీక్షించిన షారూఖ్.. దానికి అంతే ఫన్నీగా జవాబిచ్చాడు. ”అరెరె..ఇది నేను.. లేడీ వేషంలో ఉన్నాను.. అన్ని అవతారాల్లోను నేను ఆకర్షణీయంగా ఉంటానని నాకు తెలుసు. కానీ మీరు నా స్నేహితురాలి(దీపిక)ని బాగా చూసుకోవాలి. నిన్ను(దీపిక) తప్పుదారి పట్టించినందుకు క్షమాపణలు. షారుఖ్ ఖాన్ – 1.. ట్రోల్ – 0” అంటూ ఖాన్ రిప్లయ్ ఇచ్చాడు.

షారుఖ్ ఖాన్ ఇప్పుడు రెట్టించిన ఆనందోత్సాహంతో ఉన్నాడు. దానికి ఒక సముచిత కారణం ఉంది. జీరో మూవీ డిజాస్టర్ అయ్యాక నాలుగు సంవత్సరాలలో మొదటి ప్రయత్నం- పఠాన్. సుదీర్ఘ విరామం తర్వాత కంబ్యాక్ ని ఘనంగా చాటాలని ఖాన్ ఎంతో తపించి పని చేసారు. ఇప్పటికే ఓపెనింగ్ వీకెండ్ హౌస్ ఫుల్స్ అన్న టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు ఇప్పటికే మొదటి రోజు దాదాపు 4 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. డే వన్ లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు తెస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. బాలీవుడ్ చార్ట్ లలో బాహుబలి: ది కన్క్లూజన్ -KGF: చాప్టర్ 2 మాత్రమే మొదటి రోజు ఇంత భారీగా టిక్కెట్ ల విక్రయాలతో సంచలనాలు సృష్ఠించాయి. ఆ తర్వాత కింగ్ ఖాన్ పఠాన్ కి చోటు దక్కనుందని అంచనా వేస్తున్నారు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ లో షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె- జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషించారు. జిమ్ (జాన్) నుండి తీవ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి పని చేసే రహస్య ఏజెంట్ గా ఖాన్ నటించారు. అతడి ప్రియురాలిగా దీపిక పదుకొనే ఒక ఆసక్తికర పాత్రలో నటించింది.