బ‌న్నీ..ప్ర‌భాస్ గురించి హ‌న్సిక మ‌న‌సులో మాట‌

డార్లింగ్ ప్ర‌భాస్…ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్లు. తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌ర్నీ మొద‌లు పెట్టి అన్ని భాష‌ల్లోనూ ఫేమ‌స్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా? ఇలా ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించా లంటే? అంత‌కు మించి ప్ర‌తిభ ఉండాలి. ఆ రెండు క‌లిస్తేనే ఇలాంటి అద్భుతాలు సాధ్యం. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా! స‌క్సెస్ అయిన వారెంతో మంది. ఇటీవ‌లే బ‌న్నీ జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆపిల్ బ్యూటీ హ‌న్సిక ఆ ఇద్ద‌రు స్టార్ల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `నా కెరీర్ ఆరంభంలో అల్లుఅర్జున్…ప్ర‌భాస్ ల‌తో క‌లిసి ప‌నిచేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా. వారి సినిమాలిప్పుడు స‌రిహ‌ద్దుల్ని చెరిపేసి పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాయి. వారి క‌ష్టానికి ఆగుర్తింపు అర్ద‌మైంద‌ని భావిస్తున్నా. వాళ్లు ఎంత పెద్ద స్టార్స్ అయిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిలాగే విన‌యంగా ఉండ‌టం వారి గొప్ప త‌నానికి నిద‌ర్శ‌నం.

పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా..ఎంత పెద్ద స్టార్లు అయినా వాళ్ల‌లో ఎలాంటి మార్పు రాలేదు. వాళ్లింకా ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని కోరుకుంటున్నా. కొన్నాళ్ల‌గా త‌మిళ సినిమాతో బిజీగా ఉండ‌టం వ‌ల్ల తెలుగులో కొంత గ్యాప్ వ‌చ్చింది. నా 20 ఏళ్ల సినీ జీవితంలో దేని గురించి బాధ‌ప‌డ‌లేదు. అవ‌కాశా లున్నా..లేకున్నా నేనెప్పుడు ఇలాగే ఉన్నా. న‌ట‌న ప‌రంగా మాత్రం ఇంకా సంతృప్తి చెంద‌లేదు.

భ‌విష్య‌త్ లో ఇంకా గొప్ప పాత్ర‌లు చేయాల‌ని ఉంది. ఆర‌క‌మైన అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నా` అంది. హ‌న్షిక ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `మైనేమ్ ఈజ్ శృతి` అనే సినిమా నేడు రిలీజ్ అయింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు `105 మినిట్స్`.. `రౌడీ బేబి`.. `గార్డియ‌న్` చిత్రాల్లో న‌టిస్తోంది. `దేశ ముదురు`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హ‌న్సిక ప‌లు సినిమాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఎక్కువ‌గా కోలీవుడ్ సినిమాలు చేసింది