రాజ్ తరుణ్ పై ఫిర్యాదు… పోలీసులు ఏమన్నారంటే..

హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి 11 ఏళ్ళు సహజీవనం చేసి మోసం చేసాడని లిఖితపూర్వ ఫిర్యాదులో పేర్కొంది. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనని దూరం పెట్టారని రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించారు. ఆమె అన్ని అసత్య ఆరోపణలు చేసిందని పేర్కొనన్నారు.

అలాగే లావణ్యపైన పోలీసులకి కంప్లైంట్ చేస్తానని తరువాత అన్ని విషయాలు బయటపెడతానని రాజ్ తరుణ్ మీడియాకి తెలియజేశారు. ఆమెకి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని, అలాగే మస్తాన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ గుంటూరులో పోలీసులకి కంప్లైంట్ చేసిందని రాజ్ తరుణ్ తెలిపారు. ఇప్పుడు నాపై అలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్నదని, దానిని కాజేసే ప్రయత్నం చేస్తుందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేశారు.

వీటిపై లీగల్ గా తాను ఫైట్ చేస్తానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఫిర్యాదుపై తాజాగా నర్సింగ్ పోలీసులు స్పందించారు. రాజ్ తరుణ్ తో పాటు మరికొందరిపైన లావణ్య అనే యువతి 4 పేజీలతో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చిందని తెలిపారు. అయితే ఆమె కంప్లైంట్ సరైన ఫార్మాట్ లో లేదని, తేదీలు, సమయం, ప్లేస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదని పేర్కొన్నారు. ఫోన్ కాల్స్, నోటీసులకి ఆమె స్పందించలేదన్నారు.

ఒక వేళ ఆమె నుంచి స్పందన రాకుంటే ఈ రోజు సాయంత్రం వరకు వెయిట్ చేసి ఫేక్ కంప్లైంట్ గా పరిగణంలోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి అన్ని విషయాలు బయటపెట్టిన తర్వాత లావణ్య సైలెంట్ అయ్యింది. మీడియాలో ఈ న్యూస్ హడావిడి నడుస్తున్న లావణ్య మీడియా ముందుకొచ్చి మాట్లాడినట్లు కనిపించలేదు. మరి దీనిపై లావణ్య ఎలా ముందుకెళ్తుంది.

రాజ్ తరుణ్ లావణ్యపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడర సామి రిలీజ్ అయ్యే ముందు ఈ కాంట్రవర్సీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లావణ్య ఆరోపణలు చేసిన మాల్వీ మల్హోత్రా తిరగబడర సామి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.