‘శాకుంతలం’.. తొలి ప్రయత్నం అంటున్న సమంత..!

కొద్దిపాటి గ్యాప్ తర్వాత తన పూర్తి ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టిన సమంత త్వరలో రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. యశోద టైం లో హెల్త్ సహకరించక ప్రమోషన్స్ చేయని సమంత శాకుంతలం సినిమాకు ఫుల్ సపోర్ట్ అందిస్తుంది.

సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న కారణంగా బాలీవుడ్ లో సమంత సోలో ప్రమోషన్స్ చేస్తూ అక్కడ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. శాకుంతలం తన కెరీర్ లోనే ఒక ప్రత్యేక సినిమా అని చెబుతుంది సమంత.

భారీ బడ్జెట్ తో చేసే సినిమాల్లో మహిళా ప్రధాన పాత్రలు చేయడం చాలా తక్కువ. అలాంటి వాటిలో శాకుంతలం ఒకటని అన్నారు సమంత. ఇక తానొక నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎప్పటికప్పుడు తన సామర్ధ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తానని అంటుంది. తనని నమ్మి బడ్జెట్ పెడుతున్నారు అంటే ఆ సినిమా బాగా రావడం కోసం తాను ఎంత కష్టమైనా పడతా అంటుంది సమంత. శాకుంతలం సినిమా అలానే నిర్మించారని.. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడ రాజీ పడలేదని చెప్పుకొచ్చారు సమంత.

శాకుంతలం ముందు అనుకున్న బడ్జెట్ కంటే సినిమా పూర్తయ్యక కొద్దిగా ఎక్కువ అయ్యిందని అయినా సరే సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నామని అన్నారు. అంతేకాదు మహిళా ప్రధాన పాత్రతో తీసిన భారీ సినిమా ఇదే కావొచ్చు.. ఈ సినిమా వెనక చాలా ఏళ్ల కష్టం ఉందని అంటున్నారు సమంత.

సినిమాను ఎంత గొప్పగా తీసినా సరే ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. ఏప్రిల్ 14న సమంత శాకుంతలం సినిమా రిలీజ్ అవుతుంది.

గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పించగా నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. సినిమా కోసం రెండేళ్లకు పైగా కష్టపడగా ఫైనల్ గా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శాకుంతలం.