ఏఎన్ఆర్ సెంచరీ కూడా గట్టిగానే..

తెలుగు సినిమా రెండు కళ్లలాంటివారు ఎన్టీఆర్ ఏఎన్నార్. తెలుగు సినిమా కీర్తిని అందరికీ పరిచయం చేసిన వారు వీరు. వీరిద్దరి పేర్లు చెప్పకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. అలాంటి ఈ మహనీయులు ప్రస్తుతం మనతో లేరు. కానీ వారి చిత్రాల ద్వారా మన కళ్లముందే ఉన్న అనుభూతి కలిగిస్తున్నారు. ప్రస్తుతం వారి వారసులు సైతం ఇదే ఇండస్ట్రీని ఏలుతున్నారు.

కాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఇప్పటికే ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రారంభించాడు. చంద్రబాబు నాయుడితో కలిసి ఇప్పటికే ఒకసారి విజయవాడలో ఘనంగా ఉత్సవాలు చేయగా తాజాగా శనివారం హైదరాబాద్ నగరంలో మరోసారి గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఉత్సవాలకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను ఎన్టీఆర్ తో నటించిన వారందరినీ ఆహ్వానించారు. స్టార్ హీరోలు రామ్ చరణ్ వెంకటేష్ లాంటివారితో పాటు యువ హీరోలు నాగ చైతన్య డీజే టిల్లు ఇలా చాలా మంది హాజరై సందడి చేశారు.

ఎన్టీఆర్ శత జయంతి అనగానే వెంటనే ఏఎన్నార్ శత జయంతి పేరు వినపడుతోంది. వచ్చే ఏడాది ఏఎన్నార్ శత జయంతి కూడా రానుంది. దీంతో ఆయన ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారా అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే నాగార్జున ఈ మేరకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారట. ఆరు నెలల ముందు నుంచే ఫిలిం ఫెస్టివల్ ఫోటో ఎగ్జిబిషన్ ఫ్యాన్ క్లబ్ మీటింగ్స్ లాంటివి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట.

ఏఎన్ఆర్ నటించిన హిట్ చిత్రాలు అన్నింటినీ బిగ్ స్క్రీన్ లపై ప్రదర్శించాలని నాగార్జున అనుకుంటున్నారట. తన తండ్రి శత జయంతి ఉత్సవాల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని నాగార్జున భావిస్తున్నారట.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లన్నీ బాలయ్య ఒక్కడే భుజాలపై వేసుకొని చూసుకున్నారు. నాగార్జున తో పాటు ఆయన ఇద్దరు కుమారులు కూడా ఏఎన్ఆర్ ఉత్సవాల ఏర్పాట్లు చేస్తే అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మరి ఎలా ఏర్పాటు చేస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.